Asianet News TeluguAsianet News Telugu

వనపట్ల సుబ్బయ్య కవిత: కళాభారతి

శేషభట్టర్ నరసింహాచార్యులు( 89) కళాభారతి వ్యవస్థాపకుల స్మృతిలో నాగర్ కర్నూల్ నుండి వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత  ' కళాభారతి' ఇక్కడ చదవండి.

Vanapatla Subbaiah poem Kala Bharati on Seshabattar Narasimhacharyulu memory
Author
Vanaparthy, First Published Sep 8, 2021, 12:27 PM IST

కళకోసం నడిచాడు
కళానదై ప్రవహించాడు
నాటక వృక్షమై నిలిచాడు
కళాభారతై వెలిగాడు

ఊరూరు తిరిగి
ప్రతి మొఖానికి అర్దళం రుద్దీ
మనిషి మనిషికి కిరీటం తొడిగాడు
రాగం తాళం దరువు వంటబట్టించి
నాటకాలకు బండికట్టాడు
యక్షగానాలు
చిరుతల నాటకాలు 
వీది ఆటలతో
గదను గాండీవంచేసి గానాల్ని పలికించి
కళల్ని పండించాడు
కందనూలును కళాభారతిగా నడిపాడు

ఆయన
అన్నంలో రాళ్లనైనా సహిస్తడు గాని
భాషలో దోషాల్ని సహించడు
జానపదుల అధ్యయనం ఆయన ఆహరం
సాహిత్యం సాంస్కృతి రెండు కళ్లు
నటన,సంగీతం, దర్శకత్వం క్యాస్టూమ్ డిజైనింగ్ కళలు ఆయన ప్రాణనదులు

చిందుభాగోతాలు
పౌరాణికాలంటే పంచప్రాణాలు
కన్నబిడ్డలను సాదినట్లు
కళాభారతిని పెంచాడు
కళాకేతనాలను అలంకరించాడు
రంగస్థలాలకు డ్రామా డ్రస్ కంపెనై 
కందనూలును కళాకేంద్రంగా నిలబెట్టాడు

భూమికి జల దాహంలా
ఆయనకు రంగస్థల దాహం!
ఏ రాగమైనా ఆయన గొంతులో కళాయిపోసినట్లే!
హార్మోనియం మెట్లపై సరిగమల విన్యాసం!
ఏ ఆటైనా ఆయన చేతుల్లో
బొడ్డెమ్మ బంతి తిరిగినట్లే

కర్టెన్లు, కాస్ట్యూమ్స్, కిరీటాలు, ఆయుధాలు
లెక్కకు మించి ఆహార్యపు రూపకల్పనలు 
ఆ చేతుల పురుడుపోసుకోని
నాటక సరంజామ ఒక్కటీలేదు!
రూపక కళానిధి
ఆయన ఇల్లే ఓ నాటకశాల.

Follow Us:
Download App:
  • android
  • ios