నేటి బాల రచయితలే – రేపటి మేటి రచయితలు
తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక సమర్పిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” లో భాగంగా ఆదివారం, నవంబర్ 26 న నిర్వహించిన “నేటి బాల రచయితలే – రేపటి మేటి రచయితలు” 62 వ సాహిత్యసభ అత్యంత వైభవంగా జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి :
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక సమర్పిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” లో భాగంగా ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో ఆదివారం, నవంబర్ 26 న నిర్వహించిన “నేటి బాల రచయితలే – రేపటి మేటి రచయితలు” 62 వ సాహిత్యసభ అత్యంత విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బాల రచయితలకు, విశిష్ట అతిథులకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు స్వాగతం పల్కుతూ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమమని బాల రచయితలను ప్రోత్సహించడంలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొన్న బాల, యువ రచయితలు ఇంత చిన్న వయస్సులో కథలు, కవితలు, పద్యాలు, శతకాలు, నవలలు స్వతహగా రాయడం, తెలుగు సాహిత్యంపై ఎంతో పట్టుకల్గిఉండి, చాలా పరిణితితో కూడిన ప్రసంగాలు చెయ్యడం ఒక అద్భుతమని వీరందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వీరిని ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెల్పారు.
డా. పత్తిపాక మోహన్, కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత ముఖ్య అతిథిగాను, గరిపెల్ల అశోక్, బాల వికాసవేత్త విశిష్ట అతిథి గాను, ప్రత్యేక అతిథులుగా -- పుల్లా రామాంజనేయులు(ఉపాధ్యాయుడు, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా); పసుపులేటి నీలిమ, (ఉపాధ్యాయురాలు, కర్నూలు); డా. నెమిలేటి కిట్టన్న (ఉపాధ్యాయుడు, తిరుపతి); భైతి దుర్గయ్య (ఉపాధ్యాయుడు, రామునిపట్ల, సిద్ధిపేట జిల్లా); చింతకుంట కిరణ్ కుమార్ (ఉపాధ్యాయుడు, పానుగల్, వనపర్తి జిల్లా); ప్రవీణ్ కుమార్ శర్మ (ఉపాధ్యాయుడు, తడపాకల్, నిజామాబాద్) లు పాల్గొని యువతరంలో తెలుగుభాష పట్ల అనురక్తి, రచనాసక్తి కల్గించడానికి ఏ ఏ మార్గాలు అనుసరించాలి అనే సూచనలు, సలహాలు చేసి చక్కని మార్గ నిర్దేశం చేశారు.
ఈ క్రింద పేర్కొన్న బాల / యువ రచయితలు ఈ షేక్ రిజ్వాన (ఇంటర్ ద్వితీయ, ఖమ్మం); లక్ష్మీ అహాల అయ్యలసోమయాజుల (7వ తరగతి, హైదరాబాద్); బండోజు శ్రావ్య (బి టెక్ ప్రథమ, సిద్ధిపేట); శీర్పి చంద్రశేఖర్ (బిబిఎ ప్రథమ, అనంతపురం); విఘ్నేశ్ అర్జున్ (ఇంటర్ ప్రథమ, హన్మకొండ); కుమ్మర కల్పన (బి టెక్ ప్రథమ, అనంతపురం); అనుముల కృష్ణవేణి (బి.కాం తృతీయ, హైదరాబాద్); గీస శ్రీజ (పాలిటెక్నిక్ ప్రథమ, ఆదిలాబాద్); డేగల వైష్ణవి (ఇంటర్ ప్రథమ, నిజామాబాద్); వేల్పుల శ్రీలత (9వ తరగతి, పెద్దపల్లి); వలిపే రాంచేతన్ (9వ తరగతి, మేడ్చెల్); పుల్లా మురళీ ఆకాష్ (బి. ఎస్సి తృతీయ, కర్నూల్); కొండపల్లి ఉదయ్ కిరణ్ (ఇంజనీరింగ్ డిప్లమా, సంగారెడ్డి); శ్రీరాములు కుమారి (ఇంటర్ ప్రథమ, బొల్లారం); మరియు కొంపల్లి విశిష్ట (9వ తరగతి, సిద్ధిపేట)లు ఈ సమావేశంలో పాల్గొని తాము సృజించిన సాహిత్య వివరాలను తెలియజేస్తూ తమకు శిక్షణ ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తాము ఇంకా అనేక సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి తోడ్పడిన వారందరకీ తానా కృతజ్ఞతలు తెలియచేసింది.