వెలిగించు తెలుగును విస్తరించు భాషాదీపికను అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' తెలుగును వెలిగించు...' ఇక్కడ చదవండి :
అమృతమే తెలుగు
అద్భుతంగా అంతటా సంభాషించు
అజరామరం తెలుగు
ఆత్మబంధువువై పరిరక్షించు
ప్రామాణిక రూపమే తెలుగు
అనుశీలతతో పరిశోధించు
అనుబంధాల వేగుచుక్క తెలుగు
విశాలత కలిగిన క్రియాశీలిగా భావించు
విజ్ఞానాల కదంబం తెలుగు
అజ్ఞాత శూన్యం తొలగిందని గుర్తించు
సామాజిక చైతన్య స్వరూపం తెలుగు
అసలైన మూలధనం అదేనని ప్రకటించు
పీడనపై ఎలుగెత్తిన అక్షర బావుటా తెలుగు
సార్వకాలిక యదార్థమదేనని వివరించు
జనామోద ప్రతిబింబమే తెలుగు
తరతరాలకు ఆ శోభను విస్తరించు
వెలిగించు తెలుగును
విస్తరించు భాషాదీపికను
ప్రసరించు కీర్తి చంద్రికలను....
Add Asianetnews Telugu as a Preferred Source

