Asianet News TeluguAsianet News Telugu

‘నాగలి కూడా ఆయుధమే..!’  కవితా సంపుటి పరిచయ సభ

కొమ్మవరపు విల్సన్ రావు  కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పుస్తక పరిచయ సభ ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గం.లకు మీటింగ్ హాల్, యు.టి.ఎఫ్.కార్యాలయం,  శ్రీకాకుళంలో జరుగుతుంది.

The plough is also a weapon..! -Introductory meeting of poetry volume..ISR
Author
First Published Feb 19, 2024, 3:55 PM IST | Last Updated Feb 19, 2024, 4:00 PM IST

కొమ్మవరపు విల్సన్ రావు  కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పుస్తక పరిచయ సభ ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గం.లకు మీటింగ్ హాల్, యు.టి.ఎఫ్.కార్యాలయం,  శ్రీకాకుళంలో జరుగుతుంది.

ఇదివరలో విల్సన్‌రావు మూడు కవితా సంపుటాలు వెలువరించారు. ఇది నాలుగో కవితా సంపుటి.  దేవుడు తప్పిపోయాడు కవితా సంపుటి ద్వారా తెలుగు కవిత్వ ప్రపంచం మీద తనదైన ముద్ర వేసిన కవి విల్సన్‌రావు. ఈ కవితా సంపుటిపై డెబ్బయిమందికి పైగా వెలువరించిన స్పందనలతో ' ప్రేరణ '  పుస్తకాన్ని మల్లెతీగ ప్రచురణల వారు ఇటీవల వెలువరించారు. ఇపుడు నాగలి కూడా ఆయుధమే అంటూ మన ముందుకొస్తున్నారు విల్సన్‌రావు.

ప్రముఖ కథ, నవలా రచయిత అట్టాడ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా, నవ మల్లెతీగ మాస పత్రిక సంపాదకులు కలిమిశ్రీ విశిష్ట అతిథిగా పాల్గొనే ఈ సభకు సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారు.

కవి, రచయిత, నాటక కర్త, సాహితీ విమర్శకులు డా. కె.జి.వేణు, బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె.ఉదయ్ కిరణ్ పుస్తక పరిచయ ప్రసంగాలు చేస్తారు.  వి.జి.కె. మూర్తి, నెట్టిమి రమణారావు, చింతాడ తిరుమలరావు, దాసరి రామచంద్రరావు, పాయల మురళీకృష్ణ, బాల సుధాకర్ మౌళి , కంచరాన భుజంగరావు, సాంబమూర్తి లండ, బాడాన శ్యామల రావు, పూజారి దివాకర్ ఆత్మీయ స్పందన తెలియజేస్తారు.  కె.షణ్ముఖరావు, యస్. భవానీ వర ప్రసాద్ సభా నిర్వహణ చేస్తారని సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios