నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఇచ్చే కందికొండ రామస్వామి  స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం 2020కి వరంగల్ జిల్లాకు చెందిన కవి తండ హరీష్ గౌడు రచించిన "ఇన్ బాక్స్ " కవిత్వం సంపుటి  ఎంపికయినట్లు అద్యక్ష ప్రదానకార్యదర్శి వనపట్ల సుబ్బయ్య, వహీద్ ఖాన్ తెలిపారు.

ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నాడు నాగర్ కర్నూలులో  కందికొండ రామస్వామి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని తండ హరీష్ గౌడ్ కు ప్రదానం చేస్తారు. దాంతో పాటు పదవేల నగదు, శాలువ మెమొంటోలతో కవిని సత్కరిస్తారు.