Asianet News TeluguAsianet News Telugu

" కేసులా " కథల సంకలనం పుస్తకావిష్కరణ

ఆచార్య సూర్యాధనంజయ్, రమేశ్ కార్తిక్ నాయక్ సంపాదకులుగా, తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన "కేసులా" కథల సంకలన ఆవిష్కరణ నేడు మినిస్టర్ క్వార్టర్స్ లో ఘనంగా జరిగింది.
 

Telugu Story book launch programme in hyderabad
Author
First Published Nov 21, 2022, 3:45 PM IST

తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన "కేసులా" కథల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు  సత్యవతి రాథోడ్, సంపాదకులు ఆచార్య సూర్యాధనంజయ్, రమేశ్ కార్తిక్ నాయక్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సందీప్ కుమార్ సుల్తానీయా ఐఎస్, డా.యం.ధనంజయ్ నాయక్, డా.రమావత్ శ్రీనివాస్ నాయక్, డా.ఎస్ రఘు తదితరులు పాల్గొన్నారు.

 ఈ పుస్తకం గురించి మంత్రి సత్యవతి మాట్లాడుతూ... ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలన్నారు. మంచి పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించే దిశగా ఆచార్య సూర్యా ధనంజయ్, రమేశ్ కార్తీక్ నాయక్ లు పనిచేయాలని కోరారు. సంపాదకులుగా ఇంత మంచి గ్రంథాన్ని తీసుకొచ్చినందుకు వారినిద్దరిని అభినందించారు.

ఈ పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు ప్రచురించి ఇప్పటి తరానికి అందించాలని మంత్రి అభిలాషించారు. "కేసులా" అంటే మోదుగుపూలని... అవి తమ రంగుని కోల్పోవని, చెట్టు మీదున్నా, రాలిపోయినా వాటిలో  కాంతి ఏమాత్రం తరగక నిలిచే ఉంటుందన్నారు. అటువంటి మోదుగపువ్వుల లాంటి వారే ఈ గిరిజనులైన బంజారాలన్నారు. బంజారా కథా ప్రపంచంలోకి ఈ పుస్తకం రావడం తమకెంతో ఆనందంగా ఉందని మంత్రి సత్యవతి హర్షం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios