ఒక వైద్యకవిగా తన అనుభవాల స్పందను రాసుకున్న డా. టి.రాధాకృష్ణమాచార్యులు  కవిత ' కొన్ని వైరస్ లు' ఇక్కడ చదవండి :  

కొన్ని వైరస్ లు
పైకి కనిపించవు ప్రభావం చూపిస్తవి
సమయానికి పసిగట్టి
చికిత్స చేయడమే సరైన వైద్యం 

అన్నీ హాని కారకాలు కావు
కొన్ని మేలు కాంతుల 
వికాస జండాలున్నవి
సమాజం మనుగడలో మనిషి 
జీవకళల సరిగమల సన్నాయిలు

ప్రశ్నకు జవాబే దారి
అన్నింటికీ దొరకదది ఎప్పుడూ
జవాబులేని ప్రశ్నల రువ్వి
కాలం తనంతతాను కదలడమే బతుకు