Asianet News TeluguAsianet News Telugu

రచయితలకు సదవకాశం... వసుంధర విజ్ఞాన వికాస మండలి కవితల పోటీ

వసుంధర విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో రచయితలను ప్రోత్సహించేందుకు కవితల పొటీ నిర్వహిస్తున్నారు.  

Telugu poetry competition conducting Vasundara Vignyana Vikasa Mandali
Author
First Published Jan 23, 2023, 12:27 PM IST

వసుంధర విజ్ఞాన వికాస మండలి (రి,నెం-4393/96) సామాజిక, సాహితి, సాంస్కృతిక చైతన్య వేదిక త్రీ దశాబ్ది (ముఫ్పై) ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపకులు మధుకర్‌ వైద్యుల, అధ్యక్షులు చదువు వెంకటరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కట్కూరి శంకర్‌, ప్రధాన కార్యదర్శి గుడికందుల భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి గాను  ' మట్టిపరిమళాల సేద్యం ’ అనే అంశం మీదా 25 పంక్తులకు మించని కవితను రాసి పంపించాలి. వచ్చిన కవితల్లో ఉత్తమ కవితలను ఎంపిక చేసి వాటికి బహుమతులు అందజేస్తారు. 

పోటీలో పాల్గొనువారు వారి పూర్తి చిరునామా, సెల్‌ నెంబర్‌తో పాటు కవిత తమ స్వంతమనే హామీపత్రం జత చేయాలి. కవితలు  చేరాల్చిన చివరి తేదీ 5 ఫిబ్రవరి, 2023 .  ఆ తర్వాత వచ్చే కవితలను స్వీకరించరు. పోటీకి వయసుతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎవరైనా పాల్గొనవచ్చు. 

పూర్తి వివరాలకు 8096677409 నెంబర్‌లో సంప్రదించగలరు.

కవితలు పంపాల్సిన చిరునామా: 
వి.సుమలత, కన్వీనర్‌
వసుంధర విజ్ఞాన వికాస మండలి
ఇ.నెం-13-1-3/3/6/2 E, అవంతినగర్‌ తోట, మోతీనగర్‌,  హైదరాబాద్‌ -500018.

Follow Us:
Download App:
  • android
  • ios