డా.పాండాల మహేశ్వర్ : పద్యాలు

నేడు అక్షయ తృతీయ సందర్భంగా  గౌసుకొండ పోచంపల్లి నుండి డా.పాండాల మహేశ్వర్ రాసిన అక్షయ తృతీయ ప్రాశస్త్య పద్యాలు ఇక్కడ చదవండి : 
 

Telugu poems written by Pandala Maheshwar AKP

సీస మాళిక!
వైశాఖ మాసాన అర్ధ మూడవ తిథి
అక్షయ తృతియనే అందమలర!
సిరులిచ్చె మాతల్లి శ్రీలక్ష్మీ దేవియే
జననమొందినరోజు జగతికెపుడు!
అవతారపురుషుడు పరశురాముడిగాను
ప్రత్యేకమైనట్టి పండుగదియె !
భగిరథ తపస్సుతో పావనీ సురగంగ              పుడమితాకినరోజు పుణ్యతిథిగ  !

మిత్రధర్మమునెంచి కృష్ణుకుచేలున్కి
అదృష్టమందించె అసలురోజు!
వ్యాసభారతమును వ్రాయబూనినతిథి
మహిమాన్వితంబైన మంచిరోజు!
శ్రీమహాలక్ష్మితో శివయ్య మంతనం 
సకలసంపదలకు లోకమునకు
యక్షు కుబేరుండు సంరక్షకుడుకాగ
నియమింపబడినట్టి నియతిరోజు !

అజ్ఞాతవాసాన పాండవులకు రవి
అక్షయ పాత్రిచ్చి ఆర్తిదీర్చె
హరిరూపు దర్శించి చందనం పూసెటి 
సుకృతము నెరవేర్చె శుభదినంబు!
ఆదిశంకరుడిల కనకధారాస్తవం 
నోటజెప్పిన సిరి మేటిరోజు !
అన్నపూర్ణాదేవి అవతారముగమారి
అన్నార్తులను దీర్చె అభయమొసగె !

తే.గీ.
దాన ధర్మాలు పేదకు దండి జేస్తు
ధర్మమును ఆచరించుటే కర్మమనగ
మానవతనిల నిల్పుటే మంచితనము
అక్షయ తృతీయ పర్వంబు అందమవగ!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios