ఒబ్బిని కవిత : వెన్నెల పూతరేకు

వెన్నెల పూత రేకు కొబ్బరి నీళ్ళ నదీ కెరటాలై దోసిళ్లలో దోబూచులాడుతూ ఉంటుంది  అంటూ ఒబ్బిని రాసిన కవిత ' వెన్నెల పూతరేకు ' ఇక్కడ చదవండి : 
 

Telugu Poem written by Obbini

నేల నేలంతా
చాపగా పరుచుకుంటుంది
వెన్నెల పూతరేకుల కోసం !
నేల మీది సమస్త వృక్ష జాలమూ ,
నేల మీది సర్వ సౌధాలూ
వెన్నెల పూత రేకుల కోసం
కుండల వీపులై సిద్ధమవుతాయి !

          ఈ వెన్నెల పూత రేకు
          కళ్ళకి రుచులు చూపిస్తుంది !
          ఒంటికి మఖమల్ వస్త్రపు
          హాయిని కలిగిస్తుంది !
          కొబ్బరి నీళ్ళ నదీ కెరటాలై
          దోసిళ్లలో దోబూచులాడుతూ ఉంటుంది !

శాంతికీ , స్వస్థతకీ
పరమౌషదం ఈ వెన్నెల పూత  రేకు !
రాత్రుళ్లు ఆరుబయట ఆరగిస్తే
ఈ వెన్నెల పూతరేకు వన్నెల రాణి అవుతుంది !

          విద్యుత్ తీగెలని కాకుండా
          వెన్నెల కిరణాలని
          వొళ్ళంతా చుట్టుకోవాలి !
  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios