నేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా కామారెడ్డి నుండి నరసింహాచారి ముత్యాల రాసిన కవిత ' విశ్వ నరుడు ' ఇక్కడ చదవండి : 

హృదయస్పందనే గణగణమనే ఇనుపశబ్ధమయింది
కష్టాలగాట్లు నాట్యం చేసే శానంగాట్లనుమించిపోయింది
వంపులద్దిసొంపునిచ్చే 
నా సుత్తిదెబ్బలు సద్దితెచ్చి 
సాకుడు సెరువయింది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ధనధనమనే నా సమ్మెట పోటు
గ్రామబతుకులను, బస్తీలను 
మేల్కొలిపే జ్ఞానసిరులపంట
రైతుల ఎద్దులబండ్లన్నీ
ఎవసంబసల ప్రాసలెన్నో

ఎగదూకే తరువులన్నీ
ఏలుబడే ధాన్యరాశులమిల్లే
పంచదాయిల ఇళ్ళే నిత్యనూతన ప్రయోగశాల 
ఆసాముల వాకిటనిల్పే పాఠశాల
అది విశ్వకర్మల బారసాల

కొలిమిసెగల అలల భగభగలు
గుండెలదిరే ఇనుపధ్వనులు
కాలే కడుపులే మంటలై,
చితిమంటలై రగులుతుంటే
సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ
ఇలలోన పుష్టినింపే ఈ విశ్వనరుడు