ఈ నేలన ఓటు కావాలే... ఓటుకు నోటు కావాలే: రాజ్యమా మన్నించమ్మా అంటూ కర్ణాకర్ కవిత

రాజ్యమా... మన్నించమ్మా... ఒక నాడు నీవు మా అస్తిత్వ పతాక నేడు మరో ఝండా రెపరెపలకి ముందస్తు ప్రయోగ నాళిక... అంటూ జమ్మికుంట నుండి ఆర్. కర్ణాకర్ రాసిన కవిత  "రాజ్యమా...మన్నించు... !! " ఇక్కడ చదవండి.
 

Telugu Poem Written by Karunakar

రేపటి రోజున నువ్వు
ఏ రోడ్డు పక్కనో
వీధి అంచునో
చెత్త కుప్పలనో
తలకిందులుగానో
శిథిల రూపంగానో
కనిపించవచ్చు... 

అలా జరిగిన చోట మమ్మల్ని మన్నించమ్మా
ఈ నేలన... ఓటు కావాలే... 
ఓటుకు నోటు కావాలే
చీర కావాలే 
సారె కావాలే
ముక్క కావాలే సుక్కా కావాలే
బ్రాండైన  బ్రాందీ సారా కావాలే
కులం మతం వర్థిల్లనీకీ 
భవనాలు కావాలే
పెద్ద పెద్ద బాసన్లు కావాలే

నేడు నువ్వు కావాలే
నీ వెనకాలే నేనూ... 
నా ఝండా -ఎఝండా ఎగరాలే

రాజ్యమా... మన్నించమ్మా... 
ఒక నాడు నీవు మా అస్తిత్వ పతాక
నేడు మరో ఝండా రెపరెపలకి
ముందస్తు ప్రయోగ నాళిక... 
దేశమా మన్నించమ్మా .... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios