చేతులు నరికే మనిషి చేతలు తరతరాల అంతరాల పతనానికి ప్రతీకలు అంటూ జల్లిపల్లి బ్రహ్మం రాసిన  కవిత  ' మనిషికి అర్థం కావాలి ' ఇక్కడ చదవండి : 

దోసెడు వాన చినుకులు చిలకరిస్తే
పుడమి తల్లి మొలకలై పులకరిస్తుంది
చెట్లు కొమ్మల చేతులతో
విసన కర్రలై గాలులు విసురుతుంది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చేతులు నరికే మనిషి చేతలు
తరతరాల అంతరాల
పతనానికి ప్రతీకలు

పువ్వుకు ఆకుకు
మధ్య జరిగే
సౌందర్య సంభాషణ
నేలకు చెట్టుకు
మధ్య పెనవేసుకున్న
అనుబంధాల అల్లిక
మనిషికి 
అర్థం కావాలి

ఆగ్నిగోళానికి
జలకుంభానికి మధ్య
పచ్చని సంబంధం
పవిత్రంగా ఉండనివ్వాలి

ఆహారమై ప్రాణం పోయాలి
హారమై శోభను
అందివ్వాలి