బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత : పైశాచికుడా !
భావచలన బుల్డోజర్లు నడవాలే భవిష్యత్తు బుల్డోజర్లు నడవాలే! అంటూ బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన కవిత ' పైశాచికుడా ! ' ఇక్కడ చదవండి :
పశువులైనా
చోటు చూసుకొని విసర్జిస్తాయి
హీనసంస్కారి !
నీ రక్తం నిండా ఎన్ని కలుషాలున్నాయి !
నరనరానా ఎంత కొవ్వు పేరుకున్నది ?
వికృత జయాంట్‌వి
నీతోనేంసోపతి?
నేల గంధం తీసిన
భూమి పుత్రులు
పొల్లంత ఎగ బోసి
తిండి గింజలు ఊడ్చిపెట్టిన
నేల వారసులు
ఈ కప్పల తక్కెడ చిక్కు ఆటల
సర్వం కోల్పోయిన ధర్మ పాదులు
ఎం మిగిలాయని
రెక్కలే రెండు
కష్టం విలువ తెలిసినోనివా !
సంసారం ఎల్లబోసిన తెలివా !
ఆవారా! ఏ మనిషివీ
కలిమిలేమి కన్నీళ్లు కానినోనివా !
మనిషి మీదనా !
నీ అసభ్యత మీద చెయ్యాలె
నీ అకృత్యం మీద చెయ్యాలె
నీ మీద చెయ్యాలె
బహిర్మలినాలు బాగుంటుందా !
ఎవరికన్నాఎక్కువ కాకపోవచ్చు
నీకన్నా తక్కువేం కాదు
పైశాచికుడా !
నీతో సమానమెట్లా !
పల్లేర్లు కుమ్మేముళ్ళు
గాజు పెంకులు
తుప్పు కీకారణ్యాలు
అడ్డుదిడ్డంగా మొలచిన
కలుపు మోళ్లు పెకిలించాలె
బుల్డోజర్లు నడవాలె
భావచలన బుల్డోజర్లు నడవాలే
భవిష్యత్తు బుల్డోజర్లు నడవాలే!