అంజనా శ్రీ కవిత : నల్లని చీకటి తెరలమాటున

ఎప్పుడూ వెలుతురు చూడాల్సిన వీళ్లు చీకటిలో గబ్బిలాలుగా వేలాడుతుంటారు అంటూ ఖమ్మం  నుండి అంజనా శ్రీ రాసిన కవిత ' నల్లని చీకటి తెరలమాటున ' ఇక్కడ చదవండి : 

Telugu Poem written by Anjana Sri AKP OPK

నల్లని చీకటి తెరల మాటున 
రకరకాలుగా ముసుగులు కప్పుకొని
ఎవరికి దొరకని దూర తీరాలలో సాగిపోతున్నానని అనుకుంటారు

జీవితమంతా చీకటి సముద్రంలో కలిసిపోయేదాకా
వెలుతురు చూడని వ్యక్తులు వీళ్ళు
జీవితమంతా సుఖ భోగ లాలస
చిందరవందరగా ఎక్కడెక్కడికో సాగేరు  
చివరికి కుప్పకూలిపోయే సాహసాలు

ఎప్పుడూ వెలుతురు చూడాల్సిన వీళ్లు 
చీకటిలో గబ్బిలాలుగా వేలాడుతుంటారు
పాడుబడిన  శిధిల గృహాలలో 
వీరి సహవాసపు మిత్రులతో ...

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios