గోపగాని రవీందర్ కవిత : సంభాషణలు

సువిశాలమైన ఈ అక్షర క్షేత్రంలో మనది ఆవిశ్రాంత గమనం..! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత  ' సంభాషణలు ' ఇక్కడ చదవండి : 

Telugu poem Sambhashana written by Gopadani Ravinder AKP

రోజంతా నీతో అలా
మాట్లాడుతూనే ఉంటాను
ఇది అది అని కాదు
మనసునుండి ఉబికి వస్తున్న
ప్రతి మాటను నీతో మాట్లాడుతుంటాను
రాత్రి పొద్దు పోయేదాకా
పగలు రాత్రయ్యే దాకా
మనల్ని విడువని సంభాషణలు
అవన్నీ నీకు గుర్తుంటున్నాయా
ఒక్కసారైనా వాటిని తిరిగి చెప్పవూ
ఎలా నమ్మేది నిన్ను 
వింటూనే మాట్లాడడం నీ బలమైతే
తడుముకోకుండా మాటల ఊటనై
నీ దగ్గర ప్రవహించడమే నా ఉనికి 
సువిశాలమైన ఈ అక్షర క్షేత్రంలో
మనది ఆవిశ్రాంత గమనం..!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios