వసంతాల హోలీ మన జీవితాన కావాలి ఆనందకేళి అంటూ వరలక్ష్మి రాసిన కవిత  ' ఇంద్రధనుస్సు ' ఇక్కడ చదవండి : 

సప్త వర్ణాల ఇంధ్ర ధనుస్సు 
మనసు తాకుతున్న వేళ 
ఆనందాల రంగులు 
ఒంటినంటిన వేళ 
నచ్చిన వారిని మెచ్చుతూ
మనసంత కవ్వింత

అంతరంగపు వలపుల
గిలిగింత
రాధా మాధవుల 
రాసక్రీడల తుళ్ళింత
తడిసి ముద్దయ్యే 
మధురభావాల 
వసంతాల
వలపుల 
ఆనందాల గిలిగింత