డాక్టర్ ఎం. దేవేంద్ర తెలుగు కవిత: కరోనాతో యుద్ధం
కరోనా వైరస్ నేపథ్యంలో దేవేంద్ర అనే కవయిత్రి ఓ తెలుగు కవిత రాశారు. కరోనా వైరస్ పై యుద్ధం చేయాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ దేవేంద్ర ఆ కవిత రాశారు.
ఒక్క రాష్ట్రమని కాదు
దేశదేశాల రోడ్లన్నీ
నిర్మానుష్యమైన వైనం,
మానవుల ప్రయాణాలకు
అడ్డుకట్టపడిన దైన్యం,
కనిపించని సూక్ష్మక్రిమేదో
కాలానికి సవాల్ విసిరింది,
యుద్ధభూమిలో
శత్రువు కనిపించడం లేదు,
చాపకిందనీరులాగా
మానవజీవిని వాహికగాచేసుకొని
విచిత్ర వీరంగం చేస్తుంది
తుమ్మినా, దగ్గినా
చుట్టున్న వారిలో చేరిపోతుంది,
ఎంత అదుపు చేసినా
హద్దుమీరుతూనే ఉంది.
అయినా మించిపోయింది లేదు
కాలానికి ఎదురొడ్డి
మానవున్ని కట్టడి చేద్దాం ఎట్లాంటిప్రకృతివైపరిత్యాలనైన
తట్టుకొని నిలబడటం
మనకు కొత్తేమి కాదు.
ఓ వైరస్ కిరీటి!
నిన్ను మట్టుపెట్టడమే
మా తక్షణ కర్తవ్యం.
కష్టనష్టాల గురించి
చర్చించే సమయంకాదిది
ఓ తెలుగు ప్రజలారా!
మోడీ,కేసీఆర్, జగన్ ల
ఆజ్ఞాలను శిరసావహిద్దాం.
గృహనిర్బందరక్షణలో ఉండిపోదాం!
మనవంతు భాధ్యతతో
సామాజిక దూరాన్ని పాటిద్దాం
వైద్యసిబ్బంది,పోలీస్ వ్యవస్థకు సలాం చేద్దాం!
మన ప్రభుత్వం నిర్ణయాలకు
సహకరిద్దాం!
అందరం ఒక తాటిపై నడుస్తూ
కరోనాతో యుద్ధం చేద్దాం!!
వెన్నెల వెలుగు
ప్రకృతి ఎప్పటిలాగే
పచ్చదనపు రంగును
పులుముకున్నది.
ఆకులు,పువ్వులు,కాయలు
కాలానికి నూతన శక్తిని
నింపే పనిలో ఉన్నాయి.
ఉగాదిని ఆహ్వానించాలని
ప్రకృతితో గొంతు కలపాలని
ప్రతిఇల్లు వేయి కన్నులతో
ఎదుచూస్తున్న వేళ!
కవులు,పంచాంగ కర్తలు
పత్రికలు,మీడియా
గొంతెత్తి నీ పేరును
స్మరించాలని
సన్నద్ధమౌతున్న వేళ!!
కంటికి కనిపించని
కరోనా భూతం
ప్రపంచాన్నిగజ గజ వణికిస్తుంటే !!
మా కొత్త ఆశలకు
అడ్డుకట్టలు వేస్తుంటే!!
అనూహ్య పరిణామలేవో
మా చుట్టుముట్టాయి
శార్వరి అంటే !
చీకటని విన్నాం గాని,
మానవ జీవితంలో
ఇట్లా చీకటి క్షణం
ఒకటోస్తోందని
ఇప్పుడిప్పుడే
స్పృహలోకి వస్తున్నాము.
ఓ!శార్వరి
చీకటిలో సైతం
వెన్నెల తారాకలుంటాయికదా!
పున్నమి చంద్రుడు
నిత్యం చల్లని కాంతులతో
చీకటిని వెన్నెలగా
మారుస్తాడు కదా!
ఆ వెన్నెలవెలుగులను
పుడమిపై ప్రసరింప జేయాలని
ప్రతి హృదయం తరుపున
నీకు విన్నవిస్తూ......
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature