ఓటరూ ఒక్కరోజు తిన్నవి తాగినవి రేపు కక్కాలిరా అంటూ డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత ' ఓటరూ కళ్ళు తెరవరా ' ఇక్కడ చదవండి: 

రాజకీయం 
రంకు బొంకు మంకు 
దుంకు జంకు గొంకు 
చిలుక పలుకులు 
దొంగ వలపులు
కొంగ చూపులు 
రచ్చ రచ్చ
రోజుకో జెండా
పూటపూటకో రంగు
వ్యక్తిత్వం సున్న
ఊసరవెల్లి నయం కదరా

ఓటరూ ఒక్కరోజు తిన్నవి తాగినవి
రేపు కక్కాలిరా
కళ్ళు తెరవు
మూస్తే మిగిలేది సున్నా 
తర్వాత మిగిలేది బొచ్చే
రేపు రారు నీ దరికి ఎవరు
జాగ్రత్తరో 
ఓటేసే ముందు
దగ్గర పెట్టుకోరా ఒళ్ళు!!