జ్వలిత కవిత : వికృత కారికేచర్

కుటుంబం దేశానికి మినీకేచర్ దేశం కుటుంబపు వికృత కారికేచర్ అంటున్న జ్వలిత కవిత  " వికృత కారికేచర్ " ఇక్కడ చదవండి : 

telugu kavitha vikrutha caricature

ఎవరో వచ్చి నీకు ముసుగేస్తుంటే 
మిన్నకున్నావంటే అంగీకరించినట్లే కదా

అవాంఛిత బంధాలను అంగీకరించి
అనాధగా మారడం అంటే
అజ్ఞానపీఠమై ప్రకాశించడమే

అమాయకత్వం అంటే పొగడ్తని పొంగిపోయావు
కాదు అజ్ఞానానికి పర్యాయపదం అని
నే చెప్తూనే ఉన్నాను

విచ్ఛిన్నం కావడానికి
అగ్రాలో ఉగ్రాలో అవసరంలేదు
కూసింత స్వార్థం మరికొంత పలాయనం చాలు
చొరబాటుతనమే ప్రైమ్ పేసియా

కుటుంబం దేశానికి మినీకేచర్
దేశం కుటుంబపు వికృత కారికేచర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios