Asianet News TeluguAsianet News Telugu

రేపు కరీంనగర్ లో 'జల్లెడ' పుస్తకావిస్కరణ-అంకితోత్సవం

కరీంనగర్ :రచయిత కూకట్ల తిరుపతి రాసిన ' జల్లెడ ' ఎన్నీల ముచ్చట్లు సమీక్షా వ్యాసాల పుస్తకావిష్కరణ - అంకితోత్సవం కరీంనగర్ లో జరగనుంది. మార్చి 11న అంటూ రేపు శనివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలింభవన్ లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ   కార్యక్రమం జరగనుంది.  
 

Telugu book Jalleda launching programme in Karimnagar
Author
First Published Mar 10, 2023, 12:14 PM IST

'జల్లెడ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కందుకూరి అంజయ్య అధ్యక్షులుగా, ప్రముఖ తమిళ కవి జననేసన్ రాజగోపాల్ వీరరాఘవన్ ముఖ్య అతిథిగా, పుస్తక స్వీకర్తగా డా. నలిమెల భాస్కర్, అతిథులుగా గాజోజు నాగభూషణం, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్ పాల్గొననున్నారని నిర్వహకులు తెలిపారు. బూర్ల వెంకటేశ్వర్లు పుస్తక పరిచయం చేస్తారు. సి.వి.కుమార్, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, రామానుజం సుజాత సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios