"పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటి ఆవిష్కరణ

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పద్మశాలి వంశ చరిత్రను పద్మశాలి మొగ్గలు పేర కవిత్వంగా రాశారు. ఆ కవిత్వ పుస్తకాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

Telangana minister Srinivas Goud releases Bheempalli Srikanth poetry book

పాలమూరు జిల్లా ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన పద్మశాలి వంశ చరిత్రను తెలిపే "పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటిని రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 

ఆగష్టు 22 న మహబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్పగుట్టపై గల శివమార్కండేయ దేవాలయ ప్రాంగణంలో రాఖీ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి "పద్మశాలి మొగ్గలు" కవితాసంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి వస్త్రాలనందించిన పద్మశాలి వంశ చరిత్రను సమాజంలోని అందరికీ తెలిసేలా రచించడం అభినందనీయమని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ వాణి ప్రభాకర్ రావు, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, 1 వ వార్డు కౌన్సిలర్ గడ్డం రోజా వెంకటేష్, నాయకులు బాస రామస్వామి, తిరుమల వెంకటేష్, బుదారపు వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios