Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస్ కట్ల తెలుగు కవిత: ఎదురీత

వివాదలకు సుదూరంగా స్వేచ్ఛగా తిరగాడే ఓ సంకల్ప దీక్ష కావాలి అంటూ శ్రీనివాస్ కట్ల రాసిన కవిత చదవండి.

Srinivas Katla Telugu poem, Telugu literature
Author
Hyderabad, First Published Feb 25, 2021, 1:04 PM IST

మౌనాక్షరి 
అంతరంగమే 
ఓ అంత్యాక్షరి 
గజిబిజి కాలంలో 
గందరగోళమైన 
పరిస్థితులు భారమే 
అభిరుచులు చంపుకొని 
అందరినీ కలుపుకుపోవడం 
కష్టసాధ్యమే ఇష్టాలను
విరిచేసుకొని కదలటం కష్టమే...
విలువైన మనసును 
గాయపరిచే వారి నడుమ
వ్యవహరిస్తూ జీవించడం 
సాహసోపేత చర్యే 
మంచితనం వంచనతనంగా 
మారుతున్న ఈరోజుల్లో 
కలపుగోలుగా నడుచుకోవడం కష్టమే
పదిలంగా చూసుకుంటారనే 
సగటు మనిషే కాటువేసే 
ఖర్మలో ఉన్నాం మనం...
అందలం ఎక్కించేవారు 
అనవసర నిందలతో కొందరు 
బాధలలోకి నెట్టేవారే 
వేదనలను అర్థం చేసుకొనే
నాథుడే లేడు సమాజాన 
మనలో మనం సాగేపోవడమే 
ఓ సాధనం అదే యాంత్రిక జీవనం 
కుతంత్రాలకు దూరంగా 
వివాదలకు సుదూరంగా స్వేచ్ఛగా
తిరగాడే నడకే ఓ సంకల్ప దీక్ష కావాలి...

Follow Us:
Download App:
  • android
  • ios