తెలుగులో కవిత్వానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. కవిత్వానికి ప్రత్యేక స్థానం కూడా ఉంది. శ్రీనివాస్ కట్ల రాసిన ప్రాణాధార కవితను ఇక్కడ అందిస్తున్నాం. చదవండి.

చినుకు కోసం 
తహ తహలాడే మొక్కకు 
చిరు జల్లుతోనే పులకింత
కొమ్మ కొమ్మ విచ్చుకుని 
విస్తరించాలనే తపన 
ఎదగాలనే ఆశతో 
చెట్టుగా పెరిగి వృక్షమై 
పక్షులకు ఆశ్రయమై ఆసరయై..
పామరులకు సహాయకారిగా 
నీడనిచ్చే 
ఆ తల్లి చెట్లకు 
ఏమివ్వగలం మనం...!