Asianet News TeluguAsianet News Telugu

శ్రీరామ కవిత : సంఘర్షణ

నొప్పెక్కడో తెలియకపోయినా కనపడని గాయం మాత్రం పచ్చి పుండు తడై తేమగా తాకుతూనే ఉంది అంటూ శ్రీరామ రాసిన కవిత  ' సంఘర్షణ ' ఇక్కడ చదవండి : 

Sri Rama Kavitha : Sangarshana..ISR
Author
First Published Feb 8, 2024, 2:09 PM IST

మనసులోని ఆలోచనలు
జ్ఞాపకాల పొరలను తట్టి లేపి
అల్లకల్లోలం చేస్తుంటే
మనోభావాల యంత్రం
దేహాన్ని గాయ పరచకుండా 
మనసునే బాధపెడుతుంది
నొప్పెక్కడో తెలియకపోయినా 
కనపడని గాయం మాత్రం
పచ్చి పుండు తడై
తేమగా తాకుతూనే ఉంది

ఆ నియంత్రిత చర్యకు
మనసులో ఎన్నో వర్ణాల మనస్తత్వాలు
మనసు తెరచాటున ముసుగేసుకుంటాయి
ఓ వర్ణం
ఆనందపు సంతోషాలను
తట్టి లేపితే
మరికొన్ని
మనసును మెలిపెట్టే
తీరని వేదనలై 
చుట్టూరా చేరుతాయి
ఇంకొన్ని
విషాదపు ఛాయలై అలుముకుంటాయి
నిశ్శబ్దపు చెరను 
మనసుకు శిక్షగా వేసుకున్నా
నాకూ వర్తమానానికి
మధ్య సంఘర్షణ సంవేదనలై
ఆలోచనలు కొట్టు మిట్టాడూతూనే ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios