సమాజంలో మంచిని పెంచడం, మానవీయ భావనల్ని ప్రోది చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్న కథల పోటీ ఇది. వస్తుశిల్పాల్లో వైవిధ్యం చూపిన కథలకు ప్రాధాన్యం లభిస్తుంది. పాఠకులలో హృదయ సంస్కారం పాదుకోడానికి తోడ్పడే కథారచనని ప్రోత్సహించే లక్ష్యంతో తలపెట్టిన ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

బహుమతులు
మొదటి బహుమతి : రూ. 10,000
రెండో బహుమతి : రూ. 5,000
మూడో బహుమతి : రూ. 3,000
ఏడు కథలకు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1,000

నిబంధనలు :
- జీవితం విశాలమైంది. మనిషి జీవితం అనేక అనుభవాల సమాహారం. కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. ఎంచుకున్న ఇతివృత్తాన్ని కథగా మలచడంలో చూపిన కౌశలానికే ప్రాధాన్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

- ఏం చెప్పారన్నదే కాక ఎలా చెప్పారన్నదే ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత సుందరంగా, రమణీయంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా వ్యక్తం చేశారన్నదే కీలకం.

- పోటీకి పంపించే కథలకు ఎలాంటి పేజీల పరిమితి లేదు. తాము చెప్పదలచుకున్న కథని ఎన్ని పేజీలలో చెబుతారనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అందుకే పేజీలకు సంబంధించి ఎలాంటి పరిధులు, పరిమితులు లేవు.

- పోటీకి పంపించే కథలు సొంత కథలై ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.

- కవర్‌ మీద శ్రీమక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌`పాలపిట్ట కథలపోటీ-2022కి అని రాయాలి. పోటీ నిమిత్తం పంపించే కథలు తిప్పి పంపడం సాధ్యం కాదు.

- కథల ఎంపిక విషయంలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు, సంప్రదింపులకు తావు లేదు.

- ఈ పోటీలో ఎంపిక చేసే కథలని పాలపిట్టలో ప్రచురించడంతోపాటు భవిష్యత్తులో తీసుకురానున్న కథల సంకలనాలలోనూ ముద్రించడానికి అంగీకరించేవారు మాత్రమే ఈ పోటీలకు కథలని పంపించాలి.

మీ కథలు చేరడానికి చివరితేదీ - 20 అక్టోబర్‌ 2022
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.

చిరునామాః ఎడిటర్‌, పాలపిట్ట
ఎఫ్‌-2, బ్లాక్‌ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 94900 99327
Email: palapittamag@gmail.com