శిఖా - ఆకాష్ కవిత : ఒక తోటమాలి - కొన్ని తోడేళ్ల కథ

ప్రజలెప్పుడూ సింహం వేషం కట్టిన గంగిరెద్దులేనా ?!! అంటూ నూజివీడు నుండి శిఖా - ఆకాష్  రాసిన కవిత ' ఒక తోటమాలి - కొన్ని తోడేళ్ల కథ ' ఇక్కడ చదవండి : 

Shikha - Akash's poem - bsb - opk

తోటమాలి ఎవరో
ఆకాశానికి
నారింజ పళ్ళు కాపిస్తున్నాడు !

చిత్రకారుడు ఎవరో
భూమికి 
కాషాయ రంగేస్తున్నాడు !!

ఒకానొక ఊడల మర్రి
జడల దయ్యం
దేశాన్ని వెనక్కి నడిపిస్తుంది
ముందుగా  !!

రాజ్యం ఎప్పుడూ
గంగిగోవు వేషం కట్టిన
తోడేలేనా ?!

ప్రజలెప్పుడూ
సింహం వేషం కట్టిన
గంగిరెద్దులేనా ?!!

విబూది వాదమేదో
విజృంభిస్తున్నది !
విభేదాల స్వర్గమేదో
గాండ్రిస్తున్నది !!

స్త్రీలను వివస్త్రను 
చేస్తున్న మౌనం పేరు
ఏ వాదమో 
ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

మనుషులంటే ఓట్లు తప్ప
మరి ఏమీ కానిచోట
ఎన్నికలు వర్ధిల్లాలి

రాజు చెప్పేదే ధర్మం
ఒకానొక స్మశానం
వెలిగిపోతోంది !

ఇండియా మారిపోతోంది
భారత్ వర్ధిల్లాలి!
దేశభక్తి విస్తరిల్లాలి !!

సనాతనం
నిత్య నూతన
రాజకీయ సత్యం !

దేశభక్తి ఎల్లప్పుడూ
సత్యశోధక 
ఎన్నికల కుతంత్రo !?

మతాలు - కులాలుగా
మనుషులు కొలవబడే
వ్యూహాత్మక రచన పేరు
హిందుత్వం !?
ఒక భక్తి వ్యాపారం
వర్ధిల్లాలి! వర్ధిల్లాలి!
దయ్యాలు వేదాలు వల్లించే
శాశ్వత ధర్మం !?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios