మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు దక్కింది. 

Shashi Tharoor wins Sahitya Akademi Award 2019 for An Era Of Darkness

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ 2019 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన శశిథరూర్ తిరువనంతపురం నుండి ఎంపీగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్: ది బ్రిటిష్ ఎంపెర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని శశిథరూర్ రాశారు.ఈ పుస్తకం 2016లో ప్రచురించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది డిసెంబర్ 18వ తేదీన  ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్‌లో భాషలో రాసిన ఆయన పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. దేశంలోని 23 భాషల్లో అవార్డులను ఇచ్చింది.

దేశంలో బ్రిటిష్ పాలన గురించి ఈ పుస్తకంలో శశిథరూర్ ప్రస్తావించారు. శశిథరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్ కాలేజీ న్యూఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. 1978లో ఇంటర్నేషనల్ సంబంధాలపై డాక్టరేట్‌ను పూర్తి చేశాడు. 

ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ , పబ్లిక్ రిలేషన్స్ లో పనిచేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios