అత్యాధునిక తెలుగు సాహిత్యంపై సదస్సు

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-202) అనే అంశంపై ఆ సెమినార్ 2021 జనవరి 19, 20, 21 తేదీలలో  జరుగుతుంది. 

Seminar on evolution of post modern Telugu Literature

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు మరియు నెచ్చెలి అంతర్జాల వనితా మాస  పత్రిక,కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్
అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-2020)
2021 జనవరి 19, 20 & 21 తేదీలలో  జరుగును.
ఈ సదస్సులో పాల్గొనేవారు 
మీ పరిశోధన పత్రాలను teluguweb2021@gmail.com అనే మెయిల్ ఐడికి 25/12/2020 లోపు పంపగలరు. ఆ తర్వాత పంపే   పరిశోధన పత్రాలు ముద్రణకు తీసుకోబడవని గ్రహించగలరు.  పరిశోధన పత్రాలను అను-7,  ప్రియాంక  ఫాంట్ 18, లైన్ స్పేస్ 21 తో  లైన్
స్పేస్ పేజీమేకర్ ఫైల్ తో పాటు, తప్పనిసరిగా యూనికోడ్ ఫాంట్ తో వర్డ్ ఫైల్ లో కూడా
పంపాలి. పరిశోధనా పత్రం 5 పేజీలు మించకుండా ఉండాలి. పిడియఫ్ లు పరిగణనలోకి తీసుకోబడవు.  వివరాలకు: ఆచార్య కె. ఆశాజ్యోతి
తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు
ఫోన్: 9449672394; మెయిల్ ఐడి: teluguweb2021@gmail.com
లేక
డా. కె. గీత
కంప్యూటేషనల్ లింగ్విస్ట్, ఆపిల్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ.కవయిత్రి & సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios