విలువల కోసమే సిద్ధమైన త్యాగాన్ని ఇప్పుడు మీరూ ఆలింగనం చేసుకోవాల్సిందే అంటూ వర్తమాన రాజకీయాలను సంబరాజు రవి ప్రకాశ రావు తన "గాలిపటం తెగలేదు" కవితలో ఎలా వ్యక్తీకరించారో చదవండి:
తెగ బోతున్న గాలిపటం ఎవరిదో
మీ అనుభూతి లోకి వచ్చి ఉంటుంది
పయనం గాలివాటం కాదని జ్ఞాన నేత్రం గ్రహించే
ఉంటుంది
రెక్కలు రాల్చుకుంటున్న గులాబీ రోదన
మీ కర్ణేంద్రియాలకు వినపడే ఉంటుంది
విలువలను ఎవరు తాకట్టు పెడుతున్నారో
కర్ణాకర్ణిగా ఇప్పటికే మీరు వినే ఉంటారు
విలువల కోసమే సిద్ధమైన త్యాగాన్ని
ఇప్పుడు మీరూ ఆలింగనం చేసుకోవాల్సిందే
నమ్ముకున్న సిద్ధాంతమే నట్టేట ముంచినప్పుడు రంగులు లెక్కలోకి రావు
అయినా మన పిచ్చి గానీ
రంగులు మారని వాడు ఎవడు?
జనమే జెండా , అజెండా అయినప్పుడు
ఒంటరి అనే మాట
ఆమడ దూరంలో ఉంటుంది
బహుశా ఫలితం
రాత్రంతా నీకు పీడకలే అయి ఉంటుంది
మొదలైన పతనాన్ని
ఆపే మంత్ర దండం
నీ చేతిలో ఉంది
అప్పుడో ఇప్పుడో
కాస్త ఉపయోగించు
లేకుంటే వర్తమానమే
నీ భవిష్యత్తు అవుతుంది...
Add Asianetnews Telugu as a Preferred Source

