Asianet News TeluguAsianet News Telugu

సహృదయ సాహితీ పురస్కారం 2020   కోసం తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాలకు ఆహ్వానం

వరంగల్లు లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1996 నుండి ప్రతి సంవత్సరం సుప్రసిద్ధ సాహితీమూర్తులు కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీ పురస్కారాన్ని” అందిస్తున్నది. 

Sahrudaya Sahithi invites literary criticism books dor award
Author
Hyderabad, First Published Sep 25, 2021, 1:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరంగల్లు లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1996 నుండి ప్రతి సంవత్సరం సుప్రసిద్ధ సాహితీమూర్తులు కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీ పురస్కారాన్ని” అందిస్తున్నది.  నవల, కథ, వచనకవిత, పద్యకవిత, సాహిత్య విమర్శ విభాగాలలో ప్రతిసంవత్సరం ఒద్దిరాజు వేణుగోపాలరావు గారి సౌజన్యంతో అందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2020 సంవత్సరానికి గాను తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాల మూడు ప్రతులు 2021 నవంబరు 30 లోగా  కుందావజ్ఝల  కృష్ణమూర్తి సాహిత్యకార్యదర్శి,, శ్రీమాతప్లాటునం 207 ఇం.నం.02-07-580,సంట్రల్ ఎక్సైజ్ కాలని   హనుమకొండ506001 సెల్ నం. 9840366652 కు పంపవలసిందిగా కోరుతున్నారు.

గతంలో డా. కేశవరెడ్డి, అల్లం శేషగిరిరావు, నాళేశ్వరం శంకరం, అనుమాండ్ల భూమయ్య, ఎస్వీ రామారావు, గొల్లపూడి మారుతీరావు, మునిపల్లె రాజు, డా. ఎండ్లూరి సుధాకర్  డా. గరికపాటి నరసింహారావు , డా. జయ ప్రభ, డా. ఎంవి తిరుపతయ్య , కె. వరలక్ష్మి, దర్భశయనం శ్రీనివాసాచార్య, డా. పుల్లూరి ఉమా, డా. బన్న ఐలయ్య , కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళై, డా. కాలువ మల్లయ్య, రామాచంద్రమౌళి, డా. సి హెచ్ లక్ష్మణమూర్తి , శిరంశెట్టి కాంతారావు,బోరి మురళీధర్, మందరపు హైమవతి తదితరులు  పురస్కారం అందుకున్నారు

2022 ఫిబ్రవరిలో జరగబోయే  రజతోత్సవాలలో పురస్కార గ్రహీతకు రూ.10,000/-లు  జ్ఞాపిక, శాలువాలతో సహృదయ  సత్కరిస్తుందని ఒక ప్రకటనలో అధ్యక్ష కార్యదర్శులు గన్నమరాజు గిరిజామనోహరబాబు,      డా.ఎన్.వి.ఎన్.చారిలు ఒక ప్రకటనలో తెలియజేశారు.     

Follow Us:
Download App:
  • android
  • ios