14న రొట్టమాకురేవు అవార్డులు: స్త్రీవాద కవితలకు నెచ్చెలి ఆహ్వానం
యేటా ఇచ్చే రొట్టమాకు అవార్డుల ప్రదానం ఈ నెల 14వ తేదీన హైదరాబాదులోని ముంతాజ్ కాలేజీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి శివారెడ్డి హజరువుతున్నారు. కవి యాకూబ్, శిలాలోలిత దంపతులు ఈ అవార్డులు ఇస్తున్నారు.
రొట్టమాకురేవు కవిత్వ పురస్కారం 2021 సంవత్సరానికి 'మెద' మునాస వెంకట్ (షేక్ మహమ్మద్ మియా స్మారక పురస్కారం); 'నీలిగోరింట' మందరపు హైమవతి (పురిటిపాటి రామిరెడ్డి స్మారక పురస్కారం); నిశ్శబ్ద' నరేష్కుమార్ సూఫీ , 'దండ కడియం' తగుళ్ళ గోపాల్ (కె.ఎల్ నర్సింహారావు స్మారక పురస్కారం) ఎంపికయ్యారు
ఈ పురస్కారం ప్రదానోత్సవ సభ ఈనెల 14న ఆదివారం ఉదయం గం10.30 లకు మలక్ పేట లోని ముంతాజ్ కాలేజి, బి-బ్లాక్ లో కటకోఝ్వుల ఆనందాచారి అధ్యక్షతన జరుగుతుంది. శిలాలోలిత, కవి యాకూబ్ నిర్వహిస్తున్న ఈ సభకు అతిథులుగా కె. శివారెడ్డి, జి. లక్ష్మీనరసయ్య, డా. సీతారాం హాజరవుతున్నారు.
రొట్టెమాకురేవు అవార్డులను యేటా నలుగురు కవులకు ఇచ్చే సంప్రదాయాన్ని కవి యాకూబ్, శిలాలోలిత (లక్ష్మి) దంపతులు కొనసాగిస్తున్నారు. అవార్డులకు నాలుగు ఉత్తమ కవిత్వ సంపుటులను ఎంపిక చేసుకుంటారు. ఇందులో ప్రసిద్ధ కవులతో పాటు వర్తమానకవులు ఉంటారు. ఓ మహిళ కవిని కూడా ఎంపిక చేస్తారు. ఈసారి మహిళా కవి మందరపు హైమవతి కవితా సంపుటి అవార్డుకు ఎంపికయింది. మునాసు వెంకట్ చాలా కాలంగా కవిత్వం రాస్తూ వస్తున్నారు. ఆయనను లబ్దప్రతిష్టుడైన కవిగా ఎంపిక చేశారు. నరేష్ కుమార్ సూఫీ, తగుళ్ల గోపాల్ లను వర్తమాన కవులు. వీరి కవితా సంపుటులు అవార్డులకు ఎంపికయ్యాయి.
స్త్రీవాద కవితలకు ఆహ్వానం
“అపరాజిత” నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీలకు ఆహ్వానం... నిబంధనలు ఈ కింది విధంగా ఉంటాయి.
1. స్త్రీల సమస్యలపై స్త్రీలు రాసిన కవితలను మాత్రమే పంపాలి.
2. కవితాకాలం & కవితలు – 1995 నుండి ఇప్పటివరకు వచ్చిన కవితలు ఏవైనా మూడు పంపాలి. ప్రచురణకి అర్హమయ్యిన కవితలు మాత్రమే స్వీకరించబడతాయి.
3. పత్రికల్లో ప్రచురింపబడినవైనా సరే పంపవచ్చు. తప్పకుండా ఎప్పుడు రాసినది, ఏ పత్రికలో ప్రచురించబడింది మొదలైన వివరాలు కవిత చివర రాసి పంపాలి.
4. హామీపత్రం: “నెచ్చెలి ప్రచురిస్తున్న స్త్రీవాద కవితా సంకలనం “అపరాజిత” కు కవితలను ప్రచురించడానికి పూర్తి అనుమతి ఇస్తున్నానని, మరి ఏ ప్రచురణ సంస్థకు తమ సంకలనాల్లో ప్రచురణకు అనుమతి లేదని, ఇతర స్త్రీవాద కవితా సంకలనాల్లో/ స్త్రీల సమస్యల మీద వచ్చిన కవితా సంకలనాల్లో ఇప్పటికే వచ్చినవి కావని, మరి ఏ సంకలనానికి పరిశీలనలో లేవని” విధిగా హామీపత్రంలో రాయాలి.
5. కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్, ఈమైల్) వివరాలు ఈ-మెయిలుకి జతపరచండి.
6. కవితలు ఒక్కొక్కటి 40 పంక్తుల లోపు ఉండాలి.
7.కవిత తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. వర్డ్ ఫైల్ పంపాలి. పిడిఎఫ్ లేదా పి.ఎమ్.డి లు స్వీకరించబడవు.
8. ఎంపిక చేయబడిన కవితలు “నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక” లో కూడా నెలనెలా ప్రచురింపబడతాయి.
9. కవిత పంపడానికి చివరి తేదీ: నవంబరు 15, 2021
10.ఈ-మెయిలు “అపరాజిత- నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం” అని రాసి
editor@neccheli.com (లేదా) editor.neccheli@gmail.comకి పంపాలి.
11. కవితలకు విడిగా పారితోషికం ఇవ్వబడదు కానీ ఒక్కొక్క కవయిత్రికి ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వబడుతుంది.
ఎడిటర్ -నెచ్చెలి