శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ నారాయణరావు అవార్డు

2022వ సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారానికి తెలంగాణకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. హరగోపాల్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు. ఈ అవార్డు కింద 1,01,116 నగదు, కాళోజీ అవార్డు షీల్డ్‌ను అందిస్తారు. 

ramoju haragopal name for this year kaloji narayana rao award

2022వ సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారానికి తెలంగాణకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్ ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు భాష, తెలంగాణ సాహిత్యం కోసం కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా కాళోజీ నారాయణరావు పేరిట అవార్డును ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు హరగోపాల్‌ను కాళోజీ అవార్డుకు ఎంపిక చేస్తూ సాంస్కృతిక శాఖ జీవో జారీ చేసింది. ఈ అవార్డు కింద 1,01,116 నగదు, కాళోజీ అవార్డు షీల్డ్‌ను అందిస్తారు. హరగోపాల్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు. కాళోజీ అవార్డుకు ఈయన ఎంపిక కావడం పట్ల టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios