బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ వేడుకల సందర్భంగా ఇవ్వనున్న బంజారా యూత్ ఐకాన్ అవార్డుకు నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి తండాకు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ ఎంపికయ్యారు. రమేశ్ తో పాటు ఇంతరేతర రంగాల యువకులను పలు జిల్లాల నుండి ఎంపికచేశారు.

రమేశ్ రాసిన పుస్తకం బల్దేర్ బండి బంజారాల జీవితాలకు అద్దం పట్టడమే కాకుండా ఆ జాతి అస్తిత్వాన్ని పాఠ్యాపుస్తకాల దాకా తీసుకెళ్లినందుకు, సాహిత్య సేవకు గుర్తింపుగా ఈ అవార్డుకు గుగులోత్ రవి రమేశ్ కార్తిక్ నాయక్ ను ఎంపిక చేశారు. ఈ నెల 14 వ తేదీన వరంగల్ జిల్లాలోని ముచ్చింపుల తండాలో బంజరా జాతిలోని ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రస్తుతం రమేశ్ EFL యూనివర్సిటీ లో Cop - Spanish కోర్స్ చేస్తున్నారు.