Asianet News TeluguAsianet News Telugu

రేడియమ్ కవిత : మరోవేకువ

బెల్లం ముక్కిచ్చి పండుగ చేసుకోమంటే పథకాల రథచక్రాల కింద నలిగి పోయెదెవరు? అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత ఇక్కడ చదవండి : 

radium telugu poem maro vekuva
Author
Hyderabad, First Published Jul 4, 2022, 4:36 PM IST

ఉచితానుచితాలు సాగితే
ఉచితాలకు ఆర్థిక వ్యవస్థ
లంకాదహనం మైపోదా
బాగా కుడుములు తిన్నాక 
అది వమనం కాకమానదు
పేరు గొప్పకు పోయి
ఊరు దిబ్బచేసుకుంటే
చరిత్ర విక విక నవ్వుతుంది
ప్రజా పాలనలో
పాలన తిరోగమనం పడుతుంది
ధరలు వామనునిలా పెరిగి పోయి
జనం బతుకు భారమై పోయి
పోరు బాట పడుతుంది
గెలుపు కొరకు ప్రజల డబ్బును
దారి మళ్లించడం
దారద్ర రేఖకు దిగువకు నెట్టడం
పాలన కాదు
మోసపూరిత లాలన
బెల్లం ముక్కిచ్చి
పండుగ చేసుకోమనడం
పథకాల రథచక్రాల కింద
నలిగి పోయెదెవరు?
నీరు నీరనుకుంటూ పోతే
డబ్బు నీరై పారిపోదా!
ఆత్మబంధువు అంటూ కూర్చుంటే
రొక్కం రూటు మారదా!
ఇంకెక్కడ పురోగతి
ఇక ప్రగతి అధోగతి
జనం నిజాన్ని నిలదీసినపుడు
కోటలు కూలిపోలేదా!
అందుకె అందుకే
వేకువను ఎవరు ఆపలేరు
 

Follow Us:
Download App:
  • android
  • ios