రేడియమ్ కవిత: తూర్పు - పడమర

ప్రజల్లో పట్టింపు లేని తనాన్ని, చైతన్యాన్ని రెండు ముఖాల స్థితిని చిత్రిక పట్టిన రేడియమ్   కవిత " తూర్పు - పడమర " ను ఇక్కడ చదవండి.

radium poem thurpu padamara

తూర్పు - పడమర
           
          ..1..  

దున్నకదలదు
ఉడుం పట్టువదలదు
కదిలించిన కదలాలి
పట్టువిడుపు ఉండాలి
కదలని జనం
విడవని జనం
ఎముకలు కుళ్లిన ముసలి వాళ్లు
బొరియల్లోదాగిన ఎలుకలు వాళ్లు
                   ..2..

కోయిలపాట
నెమలి న్యాట్యం
పాటలోని రాగాన్ని
నాట్యంలోని విధానాన్ని
మంచి పాటగాడు
మంచి న్యాట్యాచార్యుడు
కాదు కాదు వాళ్లే కాదు
ఆస్వాదించే పామరుడు
ఆనందించే సామాన్యుడు
ఉన్నంతకాలం
కళలు జీవామృతాలు


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios