Asianet News TeluguAsianet News Telugu

ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకి సహృదయ సాహితీ పురస్కారం

 కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీపురస్కారాన్ని” అందిస్తున్నది.  ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2019  సం.రానికి గాను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచించిన “శమంతకమణి “ పద్యకావ్యం ఎంపికైంది.

Prof Bethavolu Ramabrahmam gets Sahrudaya sahithi literary award
Author
Warangal, First Published Aug 27, 2021, 2:51 PM IST

వరంగల్లులోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1996 నుండి ప్రతిసంవత్సరం సుప్రసిద్ధ సాహితీమూర్తులు కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా  “సహృదయ సాహితీపురస్కారాన్ని” అందిస్తున్నది.   నవల , కథ , వచనకవిత , పద్యకవిత , సాహిత్యవిమర్శ ...విభాగాలలో ప్రతిసంవత్సరం ఒద్దిరాజు వేణుగోపాలరావు  సౌజన్యంతో అందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 2019  సం.రానికి గాను ఆచార్య బేతవోలు రామబ్రహ్మం రచించిన “శమంతకమణి “ పద్యకావ్యం ఎంపికైంది.   పోటీకి వచ్చిన 32  పద్యకావ్యాలనుండి న్యాయనిర్ణేతలు ఈ కావ్యాన్ని ఎంపిక చేశారు.

 గతంలో డా. కేశవరెడ్డి , అల్లం శేషగిరిరావు, నాళేశ్వరం శంకరం, అనుమాండ్లభూమయ్య , ఎస్వీ రామారావు, గొల్లపూడి మారుతీరావు , మునిపల్లె రాజు,  డా. ఎండ్లూరి సుధాకర్ ,  డా గరికపాటి నరసింహారావు ,  డా. జయ ప్రభ, డా. ఎంవి తిరుపతయ్య , కె. వరలక్ష్మి, దర్భశయనం శ్రీనివాసాచార్య,  డా. పుల్లూరి ఉమా,  డా. బన్నా ఐలయ్య , కరణం బాలసుబ్రహ్మణ్యంపిళ్ళై, డా. కాలువ మల్లయ్య, రామాచంద్రమౌళి, డా, సి హెచ్ లక్ష్మణమూర్తి , శిరంశెట్టి కాంతారావు, మురళీధర్, మందరపు హైమవతి  ఈ పురస్కారం అందుకున్నారు.

ఫిబ్రవరిలో జరగబోయే రజతోత్సవాలలో పురస్కార గ్రహీతకు  రూ.10,000/లు నగదు , జ్ఞాపిక , శాలువాలతో సహృదయ  సత్కరిస్తుందని ఒక ప్రకటనలో సంస్థ అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహరబాబు, ప్రధాన కార్యదర్శి డా.ఎన్.వి.ఎన్.చారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios