ప్రసూన బిళ్ళకంటి కవిత : స్వేచ్ఛా ప్రపంచం

 పెరిగిన విజ్ఞాన విపంచిలో మానవుల బాధ్యతను "స్వేచ్ఛా ప్రపంచం' కవితలో గుర్తు చేస్తున్నారు హైదరాబాద్ నుండి ప్రసూన బిళ్ళకంటి.  ఆ కవితను ఇక్కడ చదవండి.

Prasuna Billakanti Telugu poem in Telugu poetry

అరచేతిలో ప్రపంచం
అడుగడుగునా ఆనందం
కావలసిన స్వేచ్ఛ
అనుభవించేంత సంపద
వెతుక్కున్నంత విజ్ఞానం
కావలసిన సమాచారం
అందుబాటులో వనరులు
ఆదుకునే రాజ్యాలు
ఇదీ నేటి ప్రపంచ వర్తమానం
అంతలోనే
విజ్ఞానం పెరిగింది
స్వేచ్ఛ అవధులు దాటింది
యువత చెడుదోవ పట్టింది
నాయకుల ఉచిత స్వార్థకోరలకు
సామాన్యుడు బద్ధక బలిపశువు అవుతున్నాడు
తరాల సంస్కృతులు మంటగలిసి
విష సంస్కృతి విలువల వలువలు విప్పేసింది
పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు
సూక్ష్మ క్రిమి రూపంలో మూడవ ప్రపంచ యుద్ధం చేరింది
జరగాల్సిన నష్టం జరిగింది
పెరిగిన విజ్ఞాన విపంచిలో
సరిగమలనే స్వీకరించాలి
విశ్వంలో   ప్రతిజీవి జీవించే హక్కును
బాధ్యతగా తెలుసుకోవాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios