ప్రసూన బిళ్ళకంటి ప్రకృతిలోని పరువాల "సొగసు" కవితను ఇక్కడ చదవండి:

నింగికి నిండు జాబిలి సొగసు
చీకటిని ఛేదించు తారలు సొగసు 
శిశిర తాపం తొలగించు ఆమని సొగసు
కనులను కాపాడు రెప్ప సొగసు
తుమ్మెద గ్రోలు పూ మధువు సొగసు
పిందెను రక్షించు ఆకు సొగసు
వయసును మెప్పించు పరువాలు సొగసు
జీవం బ్రతికుండ ప్రకృతి సొగసు
ఏటిలోన ఊరు ఊట సొగసు
పల్లం ప్రవహించు నీరు సొగసు
కాసారమందు కాంచు కలువ సొగసు
బోసినోటి పాప చిరునవ్వు సొగసు
మనవరాలతో తాత పరిహాసం సొగసు
మావ కురుల ముడుచు మల్లెలు సొగసు
ఎడారిలో తడిచేయు ఎండమావి సొగసు
దూది పింజల్లె మురిపించే మంచు గడ్డ సొగసు
ధర్మ పథమున నడిపించు సంస్కృతి సొగసు
ధరావతాన్ని రక్షించు వృక్షం సొగసు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred