సారాంశం

పరిచయ సభ అక్టోబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు టాగూర్ గ్రంథాలయం, విజయవాడలో  జరుగుతుంది.  ఈ సభ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి : 

కవి కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి 'దేవుడు తప్పిపోయాడు ' పై పీఠికలు, విశ్లేషణల వ్యాస సంకలనం 'ప్రేరణ' పరిచయ సభ అక్టోబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు టాగూర్ గ్రంథాలయం, విజయవాడలో  జరుగుతుంది.  ఈ సభ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి : 

అక్టోబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి  కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి 'దేవుడు తప్పిపోయాడు ' పై పీఠికలు, విశ్లేషణల వ్యాస సంకలనం 'ప్రేరణ' పరిచయ సభ బందర్ రోడ్డు, టాగూర్ గ్రంథాలయం, విజయవాడ లో జరుగుతుంది. 

ఈ సభకు ఓ యస్ డి టు  గవర్నమెంట్,  ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ , సుప్రసిద్ధ రచయిత డా. ఎం.ప్రభాకర్ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యఅతిథిగా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ హాజరవుతారు. గ్రంథాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త, విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య ఆవిష్కరిస్తారు.

విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత అన్నవవరపు బ్రహ్మయ్య, ప్రముఖ సాహితీవేత్త, సాహితీ విమర్శకులు వంశీకృష్ణ హాజరవుతారు. గ్రంథాన్ని విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ సమీక్షిస్తారు. సభలో కవి స్పందన అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది.  ఆత్మీయంగా కొనసాగే ' ప్రేరణ' ఆవిష్కరణ సభకు సాహిత్యాభిమానులను, కవులను, రచయితలను, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ.