Asianet News TeluguAsianet News Telugu

సాహిత్య వార్తలు: కవిత్వానికి పిలుపు, రాయలసీమ కవి సమ్మేళనం

ముగ్గురు కవులు కలిసి ఓ కవిత్వ సంకలనం వెలువరించడానికి కవుల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా ఆగస్టు 1వ తేదీన రాయలసీమ కవుల సమ్మేళనం జరగనుంది.

Poems invited to publish a book, Rayalaseema poets gathering
Author
Hyderabad, First Published Jul 17, 2021, 3:58 PM IST

తెలుగు కవిత్వంలో కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులందరికీ చేస్తున్న విన్నపం.  ఇప్పటిదాకా ఏ పత్రికల్లో,  ఏ సంకలనంలో,  ఏ సామాజిక మాధ్యమాల్లోను  ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి.  అందులోంచి ఒక  కవితను మేమే ఎన్నుకుంటాం.  సిద్ధాంతాలకు, స్టేట్ మెంట్స్కి, జెండాలకు, రంగులకు, సకల వివక్షలకి , ఉత్త అభిప్రాయాలకి, సకల రాజకీయాల ప్రాపకాలకి,  వైయుక్తిక, సామూహిక తత్వజ్వర పీడన పీడితులకూ లొంగిపోకుండా  వాటినే లొంగదీసే బలమైన కవిత్వం కావాలి.  ఇప్పుడు ఇదే ప్రాణవాయువు.  పాఠకులుగా సంపాదకులు మీ కవితలను ఎంపిక చేసి  'తీవ్ర మధ్యమం' సంకలనంగా వెలువరిస్తారు.  సంపాదకులదే తుది నిర్ణయం. మీ కవితలు పంపుటకు చివరి తేది 31/10/2021.  కవితలు పంపాల్సిన చిరునామా : oddirajupk@gmail.com .
"కవిత్వం ఇది.  ఖబడ్దార్".
-  సిద్ధార్థ
- ఎం.ఎస్. నాయుడు
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

ఐదవ రాయలసీమ  మహా కవిసమ్మేళనం-2021.

రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన మరియు అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో  ఆగస్టు నెల 1 వ తేదిన ఐదవ రాయలసీమ మహాకవి సమ్మేళనం అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తున్నారు. 

ఈ  మహాకవి సమ్మేళనంలో రాయలసీమ భౌగోళికం, వాతావరణం, పర్యావరణం, సహజ వనరులు, జీవ వైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానం తదితర అంశాల నేపథ్యంగా కవిత్వం రాయాలని కవులను ఆహ్వానిస్తున్నారు.  కవులు తమ కవితలను 25 జూలై లోపు వాట్సప్ నెంబరు  99625 44299 కు పంపాలి.

డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి 
రాయలసీమ మహా కవిసమ్మేళనం సమన్వయ కర్త

Follow Us:
Download App:
  • android
  • ios