మ‌ధుక‌ర్ వైద్యుల‌ కవిత : అర్థ‌నారీశ్వ‌రం

చావుకు బతుక్కి మధ్య నరకాన్నిచూపి అర్థభాగాన్ని అర్థంతరంగా సాగనంపే జ‌న‌నీ అంటూ మ‌ధుక‌ర్ వైద్యుల‌ రాసిన కవిత ' అర్థ‌నారీశ్వ‌రం ' ఇక్కడ చదవండి : 

Poem of Madhukar Vaidya : Arthanariswaram - bsb - opk

కరిగిన కాలం కల్లోలం రేపుతుంది
కాటికి రమ్మని కబురంపుతుంది
చేతకాని చేవలేని బతుకెందుకని
చావు చావమంటూ శాపనార్థాలు

నాలుగుపదుల జీవితం నరకప్రాయం
గెలుపును జయించిన ఓటములనేకం
ఆనంద గడియలు మాయమై ఎన్నాళ్లో
నవ్వును మొలిపించని లాఫింగ్ థెరఫీ

మనిషికి మస్తిష్కానికి అనుసంధానం తెగి 
కుప్పకూలిన నాడీవ్యవస్థకు చికిత్సలేక
ఛిన్నాభిన్నమైన అవయవవ్యవస్థకు
శస్త్రచికిత్స చేసినా ఒక్కటి కాలేని దూరం

నిత్యం సంఘర్షణలతో సహజీవనం చేస్తూ
అనునిత్యం అవమానాలతో సహవాసం
ఎవరికీ చెప్పుకోలేక ఎటూ తేల్చుకోలేక
కడుపు చించుకుని ఏడ్చినా రాని కన్నీళ్లు

బంధమనే కారగారంలో బందీగా మార్చి
ప్రేమానురాగాల చీకటి తెరల మాటున
గుండెల నిండుగా తిట్ల గునపాలు దింపి
కనిపించని గాయాలు రేపుతున్న నొప్పి

మానని పుండ్లను పిన్నీసుతో గుచ్చి
చావుకు బతుక్కి మధ్య నరకాన్నిచూపి
తనువంతా రక్తసిక్తమైనా మ‌న‌సు క‌ర‌గ‌క‌
అర్థభాగాన్ని అర్థంతరంగా సాగనంపే జ‌న‌నీ

(భార్య‌ల చేతిలో హ‌త్య‌ల‌కు గుర‌వుతున్న భ‌ర్త‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన క‌విత‌)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios