కందాళై రాఘవాచార్య కవిత : మీఠాపాన్

కోపిష్టి సైతం తియ్యటి తాంబూలం నమిలితే  మధురం కోపాన్ని మాయం చేస్తుంది ! అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత ' మీఠాపాన్ ' ఇక్కడ చదవండి.
 

Poem by Kandalai Raghavacharya : Meethapan..ISR

భక్ష భోజ్య లేహ్య  నానా రుచుల  
సందడి సందడి విందు భోజనం  చేసాకా
అన్నింటి కన్నా  దర్జాగా మీఠాపాన్
నిండుగా నోట్లోకి రానే వస్తుంది 
ఆలస్యమే లేదు !
 
అన్నింటిని మరిచేలా నోటిలో తాంబూలం రాజ్యమే !
నమిలినా కొద్దీ మిఠాపాన్ నాల్క పై చెలిమె చెలిమె !
ఎరుపు రంగుతో నాల్కకు మేకప్ చేస్తుంది మీఠాపాన్

కోపిష్టి సైతం తియ్యటి తాంబూలం నమిలితే     
మధురం కోపాన్ని మాయం చేస్తుంది !

ఇచ్చిన పాన్ నమిలినాకా దుష్మన్ బీ దోస్త్ !
మీఠాపాన్ మాయలో పడితే మాటలే మాటలు
అలుగు వారినట్లు !!
గొప్ప వక్తనే

మీఠాపాన్ లు కట్టించే 
చిన్న పాన్ కోకా సైతం అంగడంగడే
అందరూ మీఠాపాన్ అభిమానులు 
కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు !
అందరి నోట మీఠాపాన్ మాట 
భిన్నత్వంలో ఏకత్వం !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios