పవన్ కుమార్ తెలుగు కవిత: పుడమికి పర్యాయపదం

రైతు ఉద్యమానికి సంఘీభావంగాఎన్ పవన్ కుమార్ రాసిన 'అన్నదాత' కవిత చదవండి.

Pawan Kumar Telugu poem Pudamiki Paryapadam

అతనిదొక సామాన్య జీవితం
కానీ ప్రపంచానికి తిండి పెట్టగలడు
తానోక మురికి మనిషి
కానీ సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయగలడు
ఖరీదైన దుస్తులు ధరించడతను
వాటి ముడిసరుకు పండిస్తాడు
పంచభక్ష పరమన్నాలు రుచించ వతనికి
పచ్చడి మెతుకులే తన ఆకలి
కటికోడు కాదతను జంతు ప్రేమికుడతను
పట్టు పరుపుల మీద పవలించడతను
పచ్చని వొడ్లపై  సేద తీరుతాడతను 
బంగళాలు, భవంతులు కావాలనుకోడు 
పూరిగుడిసే తన అందాల మేడ 
లగ్జరీ కార్లు నడపడతను ఎడ్లబండే తన వాహనం
సామాన్య వ్యక్తి కాదతను
 ప్రపంచానికి మార్గదర్శకుడతను
పాలకుల నయ వంచనకు, దళారుల దోపిడీకి బలైపోతున్న శ్రమజీవతను
ఆత్మగౌరవం లేని వ్యక్తి కాదతను 
పరువు కోసం ప్రాణం తీసుకొనే వ్యక్తతను
మోసగాడు కాదతను కలిసి రాని కాలానికి బాధ్యుడుతను 
సూర్యోదయం తరువాత మొదలై సూర్యాస్తమయం లోపు ముగించే ఉద్యోగం కాదతనిది
కాలం కాటేసిన, ప్రకృతి కన్నెర్ర చేసిన 
ధైర్యంగా నిలబడే గుండె నిబ్బరం అతనిది
బలహీనుడు కాదతను బీడు భూములను పచ్చని పంట పొలాలు గా మార్చే కర్షకుడతను
ఆత్మబంధువతను
జీతం లేని కూలి అతను 
తనంటే పుడమి పుడమి అంటే తాను.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios