Asianet News TeluguAsianet News Telugu

సాహిత్య విమర్శనా వ్యాసాలకు ఆహ్వానం

ప్రామాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ‘పాలపిట్ట బుక్స్‌’ సంస్థ సంకల్పించింది. అకాడమిక్‌ ప్రమాణాల్ని పాటిస్తూ వ్యాసాలు సమగ్రంగా, సరికొత్త ప్రతిపాదనలతో, విశ్లేషణలతో కూడినవై ఉండాలి. 

palapitta books invites to literary criticism essays ksp
Author
First Published Jul 28, 2023, 6:24 PM IST

ప్రామాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ‘పాలపిట్ట బుక్స్‌’ సంస్థ సంకల్పించింది. ‘సంశోధన’ శీర్షికన ISBN నెంబర్‌తో ఈ వ్యాసాల పుస్తకం వెలువడుతుంది. సాహిత్య విమర్శ, పరిశోధనలలో ఉన్నతమైన విలువలతో కూడిన వ్యాసాల్ని పరిశోధకులనించి, విమర్శకుల్నించి ఆహ్వానిస్తుంది. ఈ పుస్తకంలో అన్ని కొత్త వ్యాసాలు ఉంటాయి. అకాడమిక్‌ ప్రమాణాల్ని పాటిస్తూ వ్యాసాలు సమగ్రంగా, సరికొత్త ప్రతిపాదనలతో, విశ్లేషణలతో కూడినవై ఉండాలి. 

నిబంధనలు:

- తెలుగు సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల మీద రాయవచ్చు. కవిత, కథ, నవల, నాటకం, విమర్శ మొదలైన ప్రక్రియల గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలై ఉండాలి. 
- సాహిత్యంలోని భిన్న వాదాలు, ధోరణులు, వాటి ప్రభావాల గురించి వ్యాసాల్లో చర్చించవచ్చు. 
- కవిత్వం కన్నా కథ, నవల, నాటకం, విమర్శ వంటి వచన ప్రక్రియల మీద రాసిన వ్యాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం. 
- భాషకు సంబంధించి చర్చించే వ్యాసాలకు కూడా ఈ పుస్తకంలో చోటు లభిస్తుంది. కనుక ఆదివాసీ భాషలు, వివిధ ప్రాంతాల మాండలికాలు, వాటిలో వస్తున్న సాహిత్యం తీరుతెన్నులకు సంబంధించిన వ్యాసాలు పంపించవచ్చు. 
- వ్యాసాలు వ్యక్తుల మీద రాసినవై ఉండకూడదు. అంటే వారి జీవనరేఖలు, బయోడేటాలతో కూడినవై  ఉండరాదు. వారి సాహిత్యం మీద విశ్లేషణలయితే పరవాలేదు.  
- ఏ అంశం  గురించి రాసినా స్పష్టత ఉండాలి. కొత్త అంశాలు చెప్పడానికి ప్రయత్నించాలి. నూతన ప్రతిపాదనలు చేస్తే మంచిది. స్టేట్‌మెంట్ల లాగా కాకుండా తాము చెప్పదలచుకున్న అంశాలకు తగిన సమర్థనలు చూపించాలి. 
- అక్షరదోషాలు ఉండకూడు. వాక్యనిర్మాణంలో స్పష్టత తప్పనిసరి.  పదస్వరూపం సరిగా ఉండాలి. వ్యాసాన్ని ఒకటికి నాలుగుసార్లు సరి చూసుకొని పంపించాలి. 
- ఇదివరకు ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాలేదని, సోషల్‌మీడియా గ్రూపులలో పోస్టు చేయలేదని హామీపత్రం జత చేయాలి. 
- వ్యాసంతో పాటు ఎంట్రీ ఫీజుగా రూ. 2000 పంపించాలి. 
-  ISBN నెంబర్‌తో ఈ ప్రత్యేక సంచిక రావడం వల్ల పరిశోధక విద్యార్థులకు భవిష్యత్తులో విషయపరంగా ఉపయోగకరంగా వుంటుంది. 
- మీ వ్యాసాలని యూనికోడ్‌లో టైప్‌ చేసి వర్డ్‌ఫైల్‌ అండ్‌ పిడిఎఫ్‌ పంపించండి. లేదా అను 7 ఫాంట్స్‌లో టైప్‌ చేసి పంపించవచ్చు.  ఇతర వివరాలకు సంప్రదించవలసిన సెల్‌ నెంబర్‌ - 9848787284

వ్యాసాలు పంపించాల్సిన చిరునామా:

ఎడిటర్‌, పాలపిట్ట బుక్స్‌
ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044 ఫోనుః 94900 99327
email: palapittabooks@gmail.com
వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 24 ఆగస్టు 2023 
అక్టోబర్‌ నెలలో కొడవటిగంటి కుటుంబరావు జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios