ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ కవిత: హామి

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కవిత ' హామి' ఇక్కడ చదవండి.

Oddiraju Praveen Kumar Infependence day poem

ఉదయాన్ని ఇంకా ఒడిసిపట్టనే లేదు
పూలు మరికొన్ని వికసించనే లేదు
అమరుల నెత్తుటి తడి సలపరిస్తూనే ఉంది
సమానత్వం, సంక్షేమం
స్వయం సమృద్ధి, స్వాతంత్ర్య అనుభూతి
ఇంకా కొంత నేలకు మిగిలే ఉంది -

త్యాగం పునాదుల మీద మనం నడిచి వస్తున్నం
రాగద్వేషాలకు అతీతంగా కలిసిపోతున్నం
శ్రమ ఈ దేశాన్ని నిర్మిస్తుంది
శ్రమ ఈ దేశాన్ని స్వప్నిస్తుంది
శ్రమ పునాదుల మీద జాతీయ జెండా
వ్యక్తి గౌరవమై రెపరెపలాడుతుంది -

చీకటి పలకరింతలు
ఆకలి కలవరింతలు
కరువు నేల వెక్కిరింతలు
సరిహద్దుల ఆవలి ఆయుధాల వెర్రి చూపులు
విసురుతున్న సవాళ్ళ మీదుగా
మన దేశం పునర్ నిర్మితమవుతూనే ఉంది - 

ఈ సమయం ఒక అవకాశం
సమానత్వానికి సంఘీభావం
స్వాతంత్య్రం ఒక భరోసా
స్వాతంత్య్రం ఒక బాధ్యత.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios