Asianet News TeluguAsianet News Telugu

నిరుపమ తెలుగు కవిత: ప్రసవమెప్పుడో...

బడులను న్యాయగుడులను ఏలుతూనే ఉన్నా 'మహిళా రిజర్వేషన్ బిల్లు'  ఇంకా ఎందుకు ఆమోదం పొందటం లేదంటూ 'ప్రసవమెప్పుడో ' కవితలో నిరుపమ ప్రశ్నిస్తున్నారు.

Nirupama telugu poem, Telugu poetry, Telugu literature
Author
Hyderabad, First Published Jun 21, 2021, 2:08 PM IST

నరాలు నరాలలో 
వేలవత్సరాలుగా ఇంకినది 
ఒక్కసారిగా కక్కలేనిది వివక్ష
పుట్టుక పుట్టినింట కాదు 
మరణం మనిష్టం కాదు 
అమ్మ కడుపులో ఉమ్మనీటిలో 
రక్షణ లేని హత్యల్లో 
బతికి మిగలడమే అగ్నిపరీక్ష 
సగ భాగాలు -  పావు భాగాలు ఏమి కర్మ 
సకలాణువులం మనమే కదా 
సోమరులకు గోమార్లకు రూమర్లకు వెరవకుండా 
కొడుకులతో సమంగా శ్రాద్ధకర్మలు అర్చకసేవలు
విధిగా విధులన్నీ చేస్తూనే ఉన్నాం
బడులను న్యాయగుడులను ఏలుతూనే ఉన్నాం రోగాలను రొప్పులను పశువులను పాపులను వాహనాలతో సహా తోలుతూనె ఉన్నాం
కానీ మన వాటా బిల్లు సెటిల్మెంట్ కాలేదింకా
ముత్యాల గర్భంతో ఉన్న రాజ్యం 
ప్రసవమెప్పుడో…..

Follow Us:
Download App:
  • android
  • ios