Asianet News TeluguAsianet News Telugu

నవజీవన్ కవిత : నీ పాద సేవ

నువ్వు ఇచ్చిన ఈ జన్మ నిను చేరి తరించుట కొరకే... అంటూ బెంగళూరు నుండి నవజీవన్ రాసిన కవిత  ' నీ పాద సేవ ' ఇక్కడ చదవండి:

Navajeevans poem - bsb - opk
Author
First Published Nov 10, 2023, 12:57 PM IST | Last Updated Nov 10, 2023, 12:57 PM IST

వెళ్లే దారుల్లో
పువ్వుల తీవాచి
కొత్త బాణీల స్వర నాదం
వేచి చూస్తున్న పూదోట
సీతకోకచిలుకల సమూహం
కుహు కూహూల గానామృతం
తుమ్మెదల ఝుంకారాలు
సకల ప్రాణుల ఆనందోత్సాహాలు

ఆ సూర్య కిరణాల తాకిడితో ప్రకృతి నిదురలేచి
ఉత్తేజం పొందుతూ
నీ పూజకై వేచి ఉన్నాయి
నిను తలుస్తూ
నిను కొలుస్తూ
నిను చూడడానికె
నిను చేరడానికె
ఈ జన్మ తపన

సకల ప్రాణికోటి రహస్యం
పుట్టి -గిట్టడం 
మధ్యలో నీ పాదాల చెంత సేదతీరటం
నువ్వు ఇచ్చిన ఈ జన్మ 
నిను చేరి
తరించుట కొరకే...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios