నరేష్ కుమార్ సూఫీ తెలుగు కవిత: restless
నరేష్ కుమార్ సూఫీ కవిత్వం తెలుగులో అభివ్యక్తి రీత్యా, వస్తువు రీత్యా భిన్నమైంది. కవిత అల్లికలో నరేష్ కుమార్ సూఫీ విశేషమైన ప్రతిభను చూపుతారు. ఆయన రాసిన restless కవిత చదవండి.
1
బొట్లు బొట్లుగా కరిగి పోతుంది రాత్రి
చూరుమీద నుంచి రాలే వర్షపు చుక్కల్లా
చీకటి రాలిపడుతుంది
ముక్కలు ముక్కలుగా విడిపోతుంది నిదుర
వొక శోక గీతమై గడుస్తుంటుంది కాలం
*ఒకానొక జ్ఞాపకం మళ్లీ మళ్లీ కలగా మారి
మేల్కొలుపుతుంది.
Damn..! Is this is a fucking dream !?
కళ్ళు తెరిచి, మంచినీళ్లు తాగి
కాలుతున్న సిగరేట్లా నేనూ.. తెల్లరేదాకా ఏ కదలికా లేక... అట్లా...
2
బైక్ హ్యాండిల్ మీద కూచుంటుందొక చూపు
రోడ్ వ్యూ బ్లర్ అయిపోయి
Dude... Are you okay?
నాకు నేనే ప్రశ్నించుకొని
Yah...! Iam alright
నన్ను నేనే సమాధాన పరచుకొని
*బహుశా...! నిన్న కూడా ఇక్కడే ఇదే ప్రశ్న ఇంకెవరైనా, మరెవర్నైనా అడిగి ఉంటారా??
డిస్క్ బ్రేక్ వేసి, ఆలోచనలాపీ...
ఎదురుగా ఆటోని తప్పించి... ఆఫీసులో ఎగిరిపడి
ఒక్క క్షణమైనా నిలవలేక... అట్లా...
3
రోజు గడిచి పోయి, జీవితం గుడిచిపోయి
ఏసీ గదుల్ని ద్వేషించలేకా, పచ్చని అడవిని ప్రేమించలేకా...
Dude... Just chill up Bro
పాడుకుందామొక పాట...
.
.
.
నానాటి బతుకూ నాటకమూ......