Asianet News Telugu

సాహితీ వార్తలు: కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీ

పాలపిట్ట, విమల సాహితీ సంస్థ సంయుక్తంగా కుసుమ ధర్మన్న కవితల పోటీ నిర్వహిస్తోంది. ఇంకా మరిన్ని సాహితీ వార్తలు ఇక్కడ చదవండి

Literary news: Poetry competition, Jokes competition
Author
Hyderabad, First Published Jul 8, 2021, 1:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

‘మా కొద్దీ నల్లదొరతనం’ అంటూ వందేళ్ళ కిందటనే అణచివేతకీ, వివక్షకీ వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించిన వైతాళికుడు కుసుమ ధర్మన్న. ఈ పాట రాసి వందేళ్ళు దాటిన సందర్భమిది. అయినప్పటికీ  అంటరానితనం, కులవివక్ష, దళిత బహుజనుల్ని చిన్నచూపు చూసే ధోరణి కొనసాగుతున్నది. కనుకనే కుసుమ ధర్మన్నని స్మరించుకుంటూ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయమిది. అంబేద్కర్‌ భావజాలాన్ని వందేళ్ళ కిందటనే తెలుగువారికి పరిచయం చేసిన కుసుమ ధర్మన్న స్ఫూర్తి సాహితీలోకానికి దీప్తి. అణచివేతపై ధిక్కారం ప్రకటిస్తూ ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రోది చేయడం ఆయనతోనే మొదలైంది. నల్లదొరల దౌష్ట్యాన్ని నిరసించిన కుసుమ ధర్మన్న సమరశీల దృక్పథం వెలుగులో పదునెక్కే కవిత్వం సృజించాల్సిన కాలమిది. ఈ నేపథ్యంలోనే ‘కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీ’ని నిర్వహించాలని పాలపిట్ట-విమల సాహితీ సమితి సంకల్పించాయి. .

మొదటి బహుమతి: రూ. 3000
రెండో బహుమతి: రూ. 2000
మూడో బహుమతి: రూ. 1000
పది కవితలకు ప్రత్యేక బహుమతులు
(ఒక్కొక్క కవితకు రూ. 500)

 నిబంధనలు:
1. సమాజంలో పాతుకుపోయిన అన్నిరకాల వివక్షను వ్యతిరేకించే  అంశాలు కవితా వస్తువుగా ఉండాలి.  
2. నిచ్చెనమెట్ల సమాజంలో కులవివక్ష కారణంగా బాధితులయిన పక్షాన మాట్లాడే కంఠస్వరాలకు ప్రాధాన్యం
3. ఇతివృత్తం ఏదైనా బలమైన అభివ్యక్తి గల కవితలకే పోటీలో ప్రాముఖ్యం ఉంటుంది.
4. కవితలకు ఎలాంటి కొలబద్దలు, లైన్ల నిడివి అనే కొలతలు ఏమీ లేవు. మీరు చెప్పాలనుకున్న విషయం పరిపూర్ణంగా కవితలో వ్యక్తమయినదో లేదో పరిశీలించుకోండి.
5. కవితలు తిప్పి పంపడం సాధ్యం కాదు.
6. కవితలు ఈమెయిల్‌ చేయండి లేదా పోస్టు చేయండి. వాట్సాప్‌  చేస్తే పరిశీలించడం కుదరదు.
7. మీ పేరు, చిరునామా విడిగా రాయండి.
8. పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండకూడదు. సోషల్‌మీడియాలో పోస్టు చేసి వుండకూడదు.
9. పోటీలో బహుమతులు గెలుచుకున్న కవితలనీ, సాధారణ ప్రచురణ కింది ఎంపికయిన కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురించడంతోపాటు, మున్ముందు వెలువరించే కవితా సంకలనాల్లో చేర్చడానికి సమ్మతించే వారు మాత్రమే తమ కవితలను ఈ పోటీకి పంపించాలి.
మీ కవితలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ: 31 జూలై 2021

కవితలు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్‌, పాలపిట్ట
ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌`6, ఎం.ఐ.జి:2, ఏపిహెచ్‌బి
బాగ్‌ లింగంపల్లి, హైదరాబాద్‌`500 044
ఫోను: 9848787284,
Email: palapittamag@gmail.com

- విమల సాహితీ సమితి, పాలపిట్ట 

రాష్ట్ర స్థాయి జోకులు / స్కిట్ పోటీ

మీరు హాస్య సంభాషణలతో, ముఖ కవళికలతో నవ్వించగలరా? అయితే మీ కోసమే ఈ పోటీ.. దాసరి క్రియేషన్స్ , సుప్రసిద్ధ కథకులు ఈటీ రామారావు గారి స్మారక కమిటీ సంయుక్తం గా నిర్వహిస్తున్న జోకులు/ స్కిట్ పోటీలకు జోకులు స్కిట్ లు వీడియోల రూపంలో ఆహ్వనిస్తున్నామని నిర్వాహకులు దాసరి చంద్రయ్య తెలిపారు.

వీడియో నిడివి : 3 నుండి 5 నిమిషాలు ఉండాలని వీడియోలు ఫోను అడ్డంగా ఉంచి రికార్డు చేయాలని తెలిపారు.  మొత్తం పది నగదుబహుమతులు గల ఈ పోటీకి  వీడియోలను పంపవలసిన వాట్సాప్ నంబర్ 9440407381.  వీడియోలు పంపుటకు చివరి తేదీ జూలై 20.

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2020 ఫలితాలు  

రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన ఆరేళ్ళ నుండి ఏటా జన రంజక కవిత్వ గ్రంథాల కిస్తున్న పురస్కారాలను ప్రకటించారు.  ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే  ప్రదానం చేసే ఈ పురస్కారాల కార్యక్రమం కరోనా కారణంగా ఆలస్యం అయినట్టు నిర్వాహకులు తెలిపారు.  2016 నుండి 2020 వరకు ప్రచురించిన కవితా సంపుటాల నుండి న్యాయనిర్ణేతలు  పది కవితా సంపుటాలను ఎంపిక చేశారు.   ఈ  సంవత్సరం కరోనా కారణంగా గుంటూరులో సభ జరపలేక పోతున్నందున  విజేతలైన కవులకు ఒక్కొక్కరికి రూ. 2000 /-  నగదు వారి బ్యాంకు అకౌంటుకు,  ప్రశంసాపత్రం  మెయిల్ ద్వారా లేక వాట్సప్ నంబరుకు పంపుతున్నట్టుగ డా. రావి రంగారావు సాహిత్య పీఠం కన్వీనర్ నర్రా ప్రభావతి ఒక ప్రకటనలో తెలియజేశారు.

పుస్తకాల పేర్లు, కవులు 
నది అంచున నడుస్తూ... డా. సి. భవానీదేవి 
కొత్త వేకువ ... పద్మావతి రాంభక్త
ఈ గాయాలకు ఏం పేరు పెడదాం ... డా. బీరం సుందరరావు 
నీటి దీపం ... తండ హరీష్ గౌడ్ 
తెలంగాణ రుబాయిలు ... ఏనుగు నరసింహారెడ్డి 
చౌరస్తాలో సముద్రం ... సంగెవేని రవీంద్ర 
మట్టి పొరల్లోంచి ... సోమేపల్లి వెంకట సుబ్బయ్య 
గాజు రెక్కల తూనీగ ... సాంబమూర్తి లండ 
స్పెల్లింగ్ మిస్టేక్ ... అనిల్ డ్యానీ 
అద్వంద్వం ... శ్రీరాం .

Follow Us:
Download App:
  • android
  • ios